'పెళ్లిచూపులు' డైరెక్టర్‌ కొత్త సినిమా టైటిల్‌ విన్నారా?

మరిన్ని వార్తలు

తరుణ్‌ భాస్కర్‌. 'పెళ్లిచూపులు' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న డైరెక్టర్‌. విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని, ఆ సినిమాలో నటించిన ప్రతీ ఒక్క ఆర్టిస్టుకీ మంచి పేరు తీసుకొచ్చింది. సాధారణ సబ్జెక్ట్‌ని తన క్రియేటివ్‌ టేకింగ్‌తో ఆడియన్స్‌కి ఎట్రాక్ట్‌ అయ్యేలా తెరకెక్కించాడు. సెన్సేషనల్‌ విజయం అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఈ డైరెక్టర్‌ పేరు ఎక్కడా వినిపించలేదు. కానీ తాజాగా ఈ డైరెక్టర్‌ పేరు తెరపైకి వచ్చింది. 

మరో కొత్త ప్రయోగానికి ఈ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ శ్రీకారం చుట్టాడు. ఓ కొత్త సబ్జెక్ట్‌ని ఈ సారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నాడు మనోడు. ఈ సినిమాలో నటించే వాళ్లంతా కొత్త ఆర్టిస్టులే. కొత్త ఆర్టిస్టుల్ని ఎంకరేజ్‌ చేయడంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ముందుంటుంది. అలా ఈ బ్యానర్‌లో రూపొందుతోన్న సినిమానే తరుణ్‌ భాస్కర్‌ తాజా సినిమా. ఇంతకీ ఈ సినిమా టైటిల్‌ ఏంటో తెలుసా? 'ఈ నగరానికి ఏమైంది' ధియేటర్‌లో ఏ సినిమా చూసినా మొదటగా వినబడే సౌండ్‌ ఇదే. 'ఈ నగరానికి ఏమైంది'. 

టైటిల్‌ చాలా క్యాచీగా ఉంది. సినిమాలో సబ్జెక్ట్‌ కూడా కొత్తగానే ఉంటుంది. కొత్త కొత్త సబ్జెక్ట్స్‌ని అంతే కొత్తగా ఆహ్వానించి, అభిమానిస్తున్నారు ప్రేక్షకులు. అలా మన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ఆడియన్స్‌ని ఎంతగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సి ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS