'బిగ్ బాస్' షో లోకి మరో హీరో ఎంట్రీ..

మరిన్ని వార్తలు

కొత్త సినిమా ప్రమోషన్స్ విషయంలో, బాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోకుండా టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న రిలీజ్ అయిన నేనే రాజు నేనే మంత్రి ప్రమోషన్ విషయంలో దగ్గుబాటి రానా, ఆ సినిమాలో నటించిన జోగేంద్ర పాత్ర కి తగ్గట్టుగానే పంచె కట్టులోనే దర్శనమిచ్చాడు. అంతే కాకుండా ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్' రియాలిటీ షో కి కూడా వెళ్లి తన సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు.

దీంతో ఆ తర్వాత తాప్సీ నటించిన 'ఆనందో బ్రహ్మ' సినిమా ప్రమోషన్ విషయంలో, తాప్సీ కూడా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది. దీంతో సినిమాకి అది కూడా ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు అదే బాటలో 'అర్జున్ రెడ్డి' మూవీ లో నటించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా బిగ్ బాస్ షో లో సందడి చేస్తున్నాడు.

రానా, తాప్సీ తరహాలో బిగ్ బాస్ హౌస్ లో గెస్ట్ గా ఒక ఎపిసోడ్ లో సందడి చేయనున్నాడు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్ నుండి బిగ్ బాస్ షో జరుగుతున్న పూణే కు బయలుదేరినట్లు తెలుస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS