భలే మంచి గ్లామర్‌

మరిన్ని వార్తలు

'భలే మంచి రోజు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ పేరు గుర్తుంది కదా అదేనండీ వామికా గబ్బి. ఆ సినిమా టైంలో ఏం హడావిడి చేసింది. ఫుల్‌ జోష్‌ ప్రదర్శించింది. మాంచి యాక్టివ్‌లే ఈ పిల్ల. గ్లామర్‌లోనూ ఫుల్‌ కిక్కిచ్చేసింది. ఎక్కడ చూసినా హాట్‌ హాట్‌గా ఇంటర్వ్యూలు ఇచ్చేసింది. డాన్సుల్లో సూపర్బ్‌ అనిపించుకుంది. అయితే ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. కానీ లేటెస్టుగా ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. సో క్యూట్‌ అండ్‌ హాట్‌గా ఉంది కదా వామికా. ఆమె చూపుల్లోనే ఏదో తెలీని హాట్‌నెస్‌ ఉంటుంది. కొంచెం బొద్దుగా ఉన్నా, ముద్దులొలికే గ్లామర్‌ ఈ బ్యూటీ సొంతం. ఎంత జోష్‌ ప్రదర్శించినా తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ, తమిళ, మలయాళంలో అవకాశాలు దక్కించుకుంటోంది. ఇకపై సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అవ్వాలనుకుంటోందట. ఆ రకంగా తెలుగులో మళ్లీ ఆఫర్స్‌ దక్కించుకోవాలనేదే అమ్మడి ఆలోచన. అవును సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉంటే ఇటు అభిమానులకీ దగ్గరగా ఉండొచ్చు. అటు దర్శక, నిర్మాతల దృష్టిలోనూ పడొచ్చు కదా!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS