ఈరోజు విడుదలైన కళ్యాణ్ రామ్ '118' మిక్స్డ్ టాక్ సంపాదించింది. కొంతమంది ఈ సినిమా బాగానే ఉంది.. అంటున్నారు. ఇంకొంతమంది నీరసంగా సాగిందని చెప్పేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పొజీషన్లో బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా గట్టెక్కడం కష్టమైన పనే అనిపిస్తోంది. థియేటర్‌కి వచ్చే మూడ్ జనాలకు తగ్గిపోతోంది. సినిమా ఏమాత్రం అటూ ఇటూ ఉన్నా- ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
అయితే వసూళ్లు ఎలా ఉన్నా- '118' సినిమా ఆర్థికంగా గట్టెక్కేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో ఈ సినిమాకి దాదాపు 8 కోట్ల వరకూ వచ్చాయి. ఆంధ్రా, నైజాం కలిపి రూ.5 కోట్లకు అమ్ముకున్నారు. మిగిలిన ఏరియాల నుంచి మరో 5 కోట్లు వచ్చాయనుకుంటే.. ఈ సినిమాకి రూ.18 కోట్లు వచ్చినట్టే. కళ్యాణ్ రామ్ పారితోషికంతో కలిపి రూ.12 నుంచి 14 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యి ఉంటుందని అంచనా. అంటే... విడుదలకు ముందే నిర్మాత లాభాల్ని సంపాదించాడన్నమాట.