అనసూయే కాదు, శ్రియ కూడా.!

మరిన్ని వార్తలు

హీరోయిన్‌గా మంచి అవకాశాలు దక్కించుకుంటున్న టైంలోనే ముద్దుగుమ్మ శ్రియ ఐటెం సాంగ్స్‌కి సై అంది. పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో నటించిన శ్రియకి కెరీర్‌ డల్‌ అయ్యిందనే మాట చాలా దూరం. ఎందుకంటే, 'శ్రియ పనైపోయింది' అనుకున్న టైంలో కూడా బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోతో 'గౌతమీ పుత్ర శాతకర్ణి', 'పైసా వసూల్‌' వంటి సినిమాల్లో హీరోయిన్‌ ఆఫర్లు వరించాయి. ఇదిలా ఉంటే, చాలా చాలా ఐటెం సాంగ్స్‌లో హాట్‌ హాట్‌గా చిందేసిన శ్రియని ఐటెం సాంగ్స్‌ విషయంలో మీ అభిప్రాయమేంటని అడిగితే దిమ్మ తిరిగే సమాధానమిచ్చింది. 

 

అవి అసలు ఐటెం సాంగ్సే కాదంట. స్పెషల్‌ సాంగ్స్‌ అట. ఈ మాట ఇంతకు ముందెప్పుడో విన్నట్లుందే అనుకుంటున్నారా.? అదేనండీ అనసూయ భరద్వాజ్‌ అభిప్రాయం కూడా ఇదే మరి. అదే ఒపీనియన్‌ని శ్రియ తాజాగా ఎక్స్‌ప్రెస్‌ చేసింది. ఐటెం సాంగ్స్‌ అనేవి ఎప్పుడో తన చిన్నప్పుడుండేవట. ఇప్పుడు చేస్తున్నవి ఐటెం సాంగ్స్‌ కాదట. ఓన్లీ స్పెషల్‌ సాంగ్స్‌ అని గట్టిగా స్టేట్‌మెంట్‌ ఇచ్చేసరికి ఒకింత నెటిజన్స్‌కి ఆశ్చర్యం కలిగింది. పోనీలెండి, ఏది ఏమైతేనేం ఎవరి ఒపీనియన్స్‌ వారివి. 

 

ఇకపోతే శ్రియ పెళ్లి తర్వాత కూడా మంచి మంచి అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం శ్రియ తమిళ, తెలుగు భాషల్లో వరుస అవకాశాలతో జోరు మీదుంది. ఇటీవల అరవింద్‌ స్వామి, సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'నరకాసురన్‌' సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వచ్చింది. ఆ పోస్టర్‌లో శ్రియ కూడా డిఫరెంట్‌ లుక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు కనిపించింది. అలాగే తెలుగులో శ్రియ లీడ్‌ రోల్‌లో ఓ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో మెగా డాటర్‌ నిహారిక కీలక పాత్ర పోషిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS