'అజ్ఞాతవాసి'తో 2018 ప్రారంభమైందని అనుకుంటే, మధ్యలో 'రంగస్థలం', 'మహానటి', 'భరత్ అనే నేను', ఆర్ ఎక్స్ 100', గీత గోవిందం', టాక్సీవాలా' తదితర సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ఊరటనిచ్చాయి. ఓవరాల్‌గా చూస్తే ఈ ఏడాది ఏమంత గొప్పగా లేదు. ముగింపు కూడా నిరాశపరిచింది.
'ఇదం జగత్', 'బ్లఫ్ మాస్టర్' తదితర సినిమాలు లాస్ట్ డేస్‌లో నిరాశపరిచాయి. ఇంతకు ముందు వారం వచ్చిన 'అంతరిక్షం', పడి పడి లేచె మనసు' కూడా నిలదొక్కుకోలేకపోయాయి. మొదట్లో నిరాశపరిచిన డబ్బింగ్ సినిమాలు, చివర్లో మాత్రం కాస్త ఊరటిచ్చాయి. '2.0', కేజీఎఫ్' చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఫోకస్ అంతా సంక్రాంతి మీదనే. జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు' వస్తోంది.
11న 'వినయ విధేయ రామ' వస్తోంది. 12న 'ఎఫ్ 2' రిలీజవుతోంది. మధ్యలో అంటే 10వ తేదీన 'పేట' సినిమా రిలీజ్. గత ఏడాది సంక్రాంతి పూర్తిగా నిరాశ పరిచినందువల్ల ఈ ఏడాది సంక్రాంతి మీద చాలా ఆశలున్నాయి తెలుగు సినిమాకి. ఒక సినిమా కాదు, రెండు సినిమాలు కాదు, మూడు సినిమాలూ హిట్ అవ్వాలి. డబ్బింగ్ సినిమాలు కూడా మంచి వసూళ్లు రాబట్టాలి. అప్పుడే తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర కళకళల్ని చూడగలుగుతాం.