యాక్షన్‌గాళ్‌గా మారిన అంజలి

మరిన్ని వార్తలు

పదహారణాల తెలుగమ్మాయి అంజలికి తెలుగులో ప్రాధాన్యత కాస్త తక్కువే అని చెప్పాలి. ఆమె యాక్టింగ్‌ టాలెంట్‌ సంగతి తెలిసినా, బాలయ్య, వెంకటేష్‌ వంటి స్టార్‌ హీరోలతో జోడీ కట్టినా, తమిళంలో వచ్చిన స్టార్‌డమ్‌, తెలుగులో ఎందుకో అందుకోలేకపోతోంది అంజలి. 

ఈ విషయం అటుంచితే అంజలి తాజాగా ఓ విభిన్న కథాంశం ఉన్న చిత్రానికి సైన్‌ చేసింది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. డిశంబర్‌లో సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. జనవరి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. 'ఆనంద భైరవి' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. హాట్‌ బ్యూటీ లక్ష్మీరాయ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. 

ఇంతవరకూ అంజలిలోని యాక్టింగ్‌ టాలెంట్‌ని రకరకాల షేడ్స్‌లో చూసేశాం. అయితే ఈ సినిమాలో ఓ కొత్త అంజలిని చూడబోతున్నామట. ఈ సినిమా కోసం అంజలి యాక్షన్స్‌ సీన్స్‌లో కూడా నటించాల్సి వస్తుందట. పూర్తిగా హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ కావడంతో కథ అంతా అంజలి చుట్టూనే తిరుగుతుందట. భారీ యాక్షన్‌ ఘట్టాలు అంజలిపై చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోందట. తొలిసారి ఓ యాక్షన్‌ చిత్రంలో నటిస్తోంది అంజలి. అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందట. 

కాగా ఈ మధ్య కొంచెం బొద్దుగా మారిన అంజలి కాస్త సన్నబడి స్లిమ్‌గా మరింత అందంగా మారింది. ఆ నాజూకు అందాలతో హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌ చేయించుకుని తెలుగమ్మాయిలు కూడా గ్లామర్‌ పండించగలరు అని నిరూపించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS