టాక్ అఫ్ ది వీక్- 24 కిస్సెస్

By iQlikMovies - November 25, 2018 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో లిప్ కిస్సులకి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు అని అనడం కన్నా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు పెట్టడానికి దర్శక-నిర్మాతలు పెద్దగ ఆసక్తి చూపకపోయేవారు అని అనవచ్చు. అయితే గత రెండేళ్ళ నుండి మాత్రం ‘లిప్ లాకులు’ తెలుగు సినిమాలలో సర్వసాధారణమైపోయాయి.

ఇక తాజాగా విడుదలైన 24 కిస్సెస్ చిత్రం టైటిల్ లోనే కిస్సులు ఉండడం, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్స్ లలో హీరో-హీరోయిన్స్ మధ్య గాడమైన లిప్ కిస్సులు ఉండడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. అయితే ఈ సినిమా విడుదలయ్యాక మాత్రం ప్రేక్షకులకి సదరు లిప్ లాకులు తప్ప కథ, కథనానికి అంతగా ప్రాధాన్యం లేదు అన్నది తేటతెల్లమైంది. మిణుగురులు వంటి ఒక మంచి చిత్రాన్ని తీసిన అయోధ్య కుమార్ ఈ సినిమా తీయడంతో సహజంగానే ఏర్పడిన ఆసక్తి ఈ సినిమా చూసాక నీరుగారిపోయింది.

ఈమధ్య  కాలంలో లిప్ లాకుల ట్రెండ్ సాగుతున్న తరుణంలో ఒక మంచి డైరెక్టర్ నుండి వచ్చిన సినిమా కూడా లిప్ లాకులు తప్ప మరేమీ లేదు అనే టాక్ రావడం నిజంగా శోచనీయం. అయితే అరుణ్-హెబ్బా మాత్రం తమ నటనతో ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

 

చివరగా టైటిల్ కి న్యాయం చేస్తూ కేవలం కిస్సులు తప్ప మరేమీ లేదు అని సినిమా చూసిన ప్రతిఒక్కరు తేల్చేస్తున్నారు. ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS