'రాజా ది గ్రేట్'తో ఫర్వాలేదనిపించిన రవితేజ అంతకుముందు వరుస వైఫల్యాలు చవిచూశాడు. అలాంటి టైంలో 'రాజా ది గ్రేట్' ఈ మాస్ మహారాజ్‌కి ఊపిరి అందించింది. అయితే వెంటనే 'టచ్ చేసి చూడు' పెద్ద షాక్ ఇచ్చింది. 'నేల టికెట్' మరింత పెద్ద డిజాస్టర్‌గా మారింది. వీటన్నింటికీ మించి 'అమర్ అక్బర్ ఆంటోనీ' నిరాశపరిచింది.
మాస్ మహరాజ్ అంటే మినిమమ్ గ్యారంటీ హీరో మాత్రమే కాదు. సినిమా ఎలా ఉన్నా, ఆ సినిమాతో నిర్మాతలు నష్టపోకుండా వసూళ్లు తెచ్చే హీరో. కానీ అది ఒకప్పటి మాట మాత్రమే. ఇప్పుడు రవితేజతో సినిమా అంటే నిర్మాతలు భయపడాల్సిన పరిస్థితి. అంతలా భయపెట్టాయి 'టచ్ చేసి చూడు', 'నేల టికెట్', అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలు. 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా రవితేజ ఇమేజ్‌ని చాలా దారుణంగా దెబ్బ తీసింది. నెక్ట్స్ ఏ సినిమా చేసినా రవితేజ తన రెమ్యునరేషన్ సగానికి తగ్గించుకోవల్సిందేనట. రవితేజ కూడా ఊహించనంత దారుణ ఫలితం అమర్ అక్బర్ ఆంటోనీ ఇచ్చింది. శీను వైట్ల - రవితేజ ఈ ఇద్దరి ఇమేజ్ ఈ సినిమాకి ఏ మాత్రం ప్లస్ కాలేకపోయింది.
ఒకప్పుడు శీను వైట్ల పది కోట్లు పైన రెమ్యునరేషన్ తీసుకునేవాడు. రవితేజ కూడా ఐదారు కోట్లు దాకా రెమ్యునరేషన్ అందుకున్న హీరో. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ఐదారు కోట్లుకు షేర్ పడిపోయిందంటే ఇలాంటి పరాజయాల గురించి రవితేజ చాలా సీరియస్‌గా ఆలోచించాలి.
'అమర్ అక్బర్ ఆంటోనీ' తర్వాత రవితేజ రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు.