బికినీలతో వల టిక్కెట్లు తెగేదెలా.?

మరిన్ని వార్తలు

ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్లో పెద్ద సినిమా 'మహానాయకుడు'తో పాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్‌ కానున్నాయి. వాటిలో 'మహానాయకుడు' సంగతి పక్కన పెడితే, చిన్న సినిమాల్లో ఒకటి 'మిఠాయి' కాగా, మరోటి '4 లెటర్స్‌'. ఈ సినిమాకి ప్రమోషన్స్‌ బీభత్సంగా చేస్తున్నారు. ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటిస్తున్నారు. వారి పేర్లు తుయా చక్రవర్తి, అంకెతా మహారాణా

 

ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతోనే ప్రమోషన్స్‌ హైలైట్‌ అవుతున్నాయి. ఇద్దరివీ బికినీ ఫోటోలు రిలీజ్‌ చేశారు. ఆ ఫోటోలు, ఫోటోల్లోని అమ్మాయిలు తెగ వైరల్‌ అవుతున్నారు సోషల్‌ మీడియాలో. మామూలుగా అయితే ఇలాంటి సినిమాలను పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు బోల్డ్‌ కంటెన్ట్‌ చిత్రాలకు టాలీవుడ్‌లో గిరాకీ భలేగుందిలే. ఎంత ఎక్కువ స్కిన్‌ షో చేస్తే అంతగా మాస్‌ ఆడియన్స్‌ ఎట్రాక్ట్‌ అవుతున్నారు. 

 

ఇంకేముంది నిర్మాతలకు కాసుల పండగే. అందుకే ఏరికోరి మరీ అడల్ట్‌ కంటెన్ట్‌ని జొప్పించేస్తున్నారు చిన్న సినిమాల మేకర్స్‌. అలా ఈ '4 లెటర్స్‌' మూవీపై అంచనాలు పెరిగాయి. ప్రచార చిత్రాన్ని విడుదల చేయించి, వెంకటేష్‌ ఆశీర్వాదాలు పొందింది ఈ '4 లెటర్స్‌'. మరి ప్రోమోస్‌లో చూపిస్తోన్న హాట్ నెస్‌ హిట్ట్‌ కొట్టేందుకు హెల్ప్‌ అవుతుందో లేదో చూడాలంటే జస్ట్‌ వెయిట్‌ అండ్‌ సీ ఫర్‌ టూ డేస్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS