గ్లామ్‌షాట్‌: బీచ్‌లో నడిచొచ్చే బికినీ హంస

మరిన్ని వార్తలు

బీచ్‌ ఒడ్డున బికినీలతో రెచ్చిపోయి ఎంజాయ్‌ చేయడం ముద్దుగుమ్మలకు వెన్నతో పెట్టిన విద్యే. ఈ మధ్య ఈ విద్యను అభ్యసిస్తున్న వాళ్లు కూసింత ఎక్కువైపోయారని కూడా చెప్పుకోవాలి. వన్స్‌ హీరోయిన్‌ అనిపించుకున్నారా.? ఇక అంతే.. బీచ్‌ ఒడ్డుకు పరుగులు తీయడం, హాట్‌ హాట్‌ బికినీల్లో సెగలు రేపడం.. ఇదో హాబీ అయిపోయింది అందాల భామలకు. 

 

అలా అని అందరూ ఇలా బికినీల్లో దర్శనమిచ్చేయట్లేదులెండి. అందం చూడవయా.. ఆనందించవయా.. అంటూ స్కిన్‌ షో చేసేవాళ్లు కొందరుంటే, గ్లామర్‌ అంటే స్కిన్‌ షో మాత్రమే కాదు, ఆటిట్యూడ్‌ కూడా అని ఎస్కేప్‌ అయ్యేవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ కేటగిరిని పక్కన పెడితే, స్కిన్‌ షోని మాత్రమే ఆటిట్యూడ్‌గా పెట్టుకున్న వాళ్ల గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. 

 

తాజాగా ఈ పిక్‌ చూస్తున్నారుగా. ఎవరీ కర్లింగ్‌ బికినీ హాటీ అనుకుంటున్నారా.? వన్‌ మినిట్‌ ఇంట్రడ్యూస్‌ చేసేద్దాం. '4 లెటర్స్‌' అంటూ ఓ బోల్డ్‌ మూవీ ప్రోమోలు హల్‌చల్‌ చేస్తున్నాయి గమనించారా.? ఆ మూవీలోని హీరోయినే ఈ హాట్‌ భామ. పేరు అంకేతా మహారాణా.​ బీచ్‌లో ఇలా టూ పీస్‌ బికినీలో అందాలారేసేసి కెమెరాకి పోజిచ్చేసింది. మరి లేటెందుకు, అటేపు హాట్ గా ఓ లుక్కేస్కోండి బాస్‌.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS