'దేవ్‌'డా.. చుక్కలు చూపించాడు

మరిన్ని వార్తలు

ఈ వారం విడులైన చిత్రాల‌లో 'దేవ్‌' ఒక‌టి. కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించారు. తెలుగులో ఈ సినిమాకి ఏమాత్రం ఓపెనింగ్స్‌రాలేదు. దానికి తోడు.. రివ్యూలు కూడా ఈ సినిమా ఫ్లాప్ అని తేల్చేశాయి. వ‌సూళ్ల ప‌రంగా చూస్తే... బ‌య్య‌ర్ల‌కు ఈ సినిమా చుక్క‌లు చూపించింది. తెలుగులో రూ.6 కోట్ల‌కు అమ్ముడుపోయింది సినిమా. ఇప్ప‌టి వ‌ర‌కూ 2 కోట్లు కూడా రాలేదు. 

 

త‌మిళ‌నాట కూడా అదే ప‌రిస్థితి. అక్క‌డ ఈసినిమాకి రూ.17 కోట్ల‌కు కొన్నారు. ఇప్పుడు 5 కోట్ల‌కు మించి రావ‌డం లేదు. అంటే దాదాపు 12 కోట్లు న‌ష్ట‌మ‌న్న‌మాట‌. కార్తి గ‌త చిత్రం `చిన‌బాబు` తెలుగులో ఫ్లాప్ అయ్యింది. కానీ త‌మిళ నాట మాత్రం ఈ సినిమా హిట్ జాబితాలో చేరిపోయింది. ఈసారి మాత్రం రెండు చోట్లా నిర్మాత‌ల‌కు చుక్క‌లు క‌నిపించాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS