50 మిలియన్ల వ్యూస్‌.. ఇది నిజంగానే ‘ఉప్పెన’.!

మరిన్ని వార్తలు

సినిమా రిలీజ్‌ ఎప్పుడు అవుతుందో ఏమో తెలియని పరిస్థితి. మెగా కాంపౌండ్‌ నుంచి దూసుకొస్తోన్న వైష్ణవ్‌ తేజ్‌ పరిస్థితి ఇది. ‘ఉప్పెన’ సినిమాతో ఈ యంగ్‌ హీరో తెరంగేట్రం చేస్తున్న విషయం విదితమే. సినిమా షూటింగ్‌ పూర్తయిపోయింది. నిజానికి, సినిమా నిర్మాణం కాస్త ఆలస్యమయ్యింది కూడా అనుకోని కారణాల రీత్యా. అయినాగానీ, సినిమాని పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు.. ఏప్రిల్‌లో సినిమా రిలీజ్‌ కావాల్సి వుండగా, కరోనా వైరస్‌ దెబ్బ కొట్టింది. ఇదిలా వుంటే, ‘ఉప్పెన’ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. అందులో ఒకటి ‘నీ కళ్ళు నీలి సముద్రం’ కాగా, మరొకటి ‘ధక్‌ ధక్‌ ధక్‌’.

 

ఇందులో ‘నీ కళ్ళు నీలి సముద్రం’ యూ ట్యూబ్‌ని ఓ ఊపు ఊపేస్తోంది. ఎక్కడ విన్నా ఇదే పాట హల్‌చల్‌ చేస్తుండడం గమనార్హం. ఇటీవలి కాలంలో వచ్చిన పాటల్లో ఇది చాలా ప్రత్యేకమైనదని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇప్పటికే 50 మిలియన్‌ వ్యూస్‌ సంపాదించేసుకుంది ఈ పాట. ముందు ముందు ఇంకెంతలా ఈ ‘ఉప్పెన’ హవా కొనసాగుతుందోగానీ, వైష్ణవ్‌ తేజ్‌కి ఇది వెరీ స్పెషల్‌ రికార్డ్‌గానే చెప్పుకోవచ్చు. వైష్ణవ్‌ ఎవరో తెలుసు కదా.? సుప్రీం హీరో సాయిధరవ్‌ు తేజ్‌ తమ్ముడు.. మెగా మేనల్లుడు.! కృతి శట్టిె ఈ సినిమాలో వైష్ణవ్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకుడు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించగా, ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS