సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన చిత్రం `ఏ1 ఎక్స్‌ప్రెస్`. గత వారం విడుదలైంది. తొలి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. చివరికి.. యావరేజ్ దగ్గర ఆగింది. వసూళ్లు కూడా ఫర్వాలేదనిపించే స్థాయికి తెచ్చుకుంది. తొలి వారంలో... దాదాపుగా 4.7 కోట్లు తెచ్చుకుంది. ఈ సినిమాకి 4.6 కోట్ల బిజినెస్ జరిగింది. ఆ రకంగా చూస్తే.. బయ్యర్లు గట్టెక్కేసినట్టే.
ఈ గురువారం కొత్తగా మూడు సినిమాలొచ్చాయి. శ్రీకారం, జాతిరత్నాలు, గాలి సంపత్ విడుదలయ్యాయి. అయినా సరే... ఏ1 ఎక్స్‌ప్రెస్‌కి కొన్నయినా వసూళ్లు వచ్చాయి. కాబట్టే.. బయ్యర్లు తమ పెట్టుబడిని తిరిగి సంపాదించుకోగలిగారు. శని, ఆదివారాలు సైతం... ఏ 1 ఎక్స్‌ప్రెస్ కి కొన్ని టికెట్లు దక్కితే... ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర పాసైపోయినట్టే అనుకోవాలి. మరో వైపు ఈ సినిమాతో నిర్మాతలూ సేఫే. ఓటీటీ, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రూపంలో, నిర్మాతలు బాగానే సొమ్ము చేసుకున్నారు.