హీరోయిజం చూపిస్తానంటోన్న యంగ్‌ హీరో

మరిన్ని వార్తలు

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటుడు ఆది పినిశెట్టి. ఏ పాత్ర పోషిస్తే, ఆ పాత్రకు కావల్సినంత వెయిట్‌ తేగల సమర్ధుడు. ఇటీవల 'రంగస్థలం' సినిమా ఆదికి చాలా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. 

ఇకపోతే 'రంగస్థలం' తర్వాత ఆది రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి సోలో హీరోగా నటిస్తున్న 'నీవెవరో' చిత్రం కాగా, మరోటి 'యూటర్న్‌'. 'నీవెవర్‌'లో ఆదికి జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. అందాల భామ తాప్సీ, 'గురు' భామ రితికా సింగ్‌. కాగా 'యూ టర్న్‌'లో సమంత కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే 'యూ టర్న్‌' హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ అని చెప్పాలి. జర్నీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించిన 'యూ టర్న్‌'కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్‌ని తెరకెక్కించిన పవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జర్నలిస్టు పాత్రలో సమంత నటిస్తుండగా, ఓ కేసు ఇన్వెస్టిగేషన్‌లో సమంతకు సహాయపడే పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్ర ఆది పినిశెట్టి పోషిస్తున్నాడు. 

గతంలో 'వైశాలి' చిత్రంలో ఇదే తరహా పాత్ర పోషించాడు ఆది. అదే విధంగా ఏదో పాటలు, ఫైట్లూ అన్నట్లుగా కాకుండా, ఆధ్యంతం ఆశక్తిగా సాగే కథా, కథనాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆదికి మరోసారి మంచి గుర్తింపు తెచ్చిపెట్టే సినిమా 'యూటర్న్‌' అవుతుందనడంలో అతిశయోక్తి కాదనిపిస్తోంది. 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది 'యూటర్న్‌'.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS