ప్రభుదేవా, తమన్నా జంటగా తెరకెక్కిన 'అభినేత్రి' సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'అభినేత్రి 2'గా వస్తున్న ఈ సినిమా ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'అభినేత్రి 2' తెలుగు వెర్షన్ ట్రైలర్‌ని విడుదల చేశారు. అభినేత్రి పార్ట్ 1కి మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో ఉన్నట్లు కనిపిస్తోంది.
డైలాగుల దగ్గర్నుంచీ, గ్లామర్ వరకూ అన్నీ ఎక్కువే అన్నట్లున్నాయి. తొలి పార్ట్‌లో రూబీ పాత్రలో తమన్నా సో హాట్‌గా కనిపిస్తే, దేవి పాత్రలో ట్రెడిషనల్‌గా కనిపించి ఆకట్టుకుంది. రూబీగా తమన్నా, ప్రభుదేవాని భయపెట్టింది. ఈ సీక్వెల్‌లో తమన్నాని ప్రభుదేవా భయపెట్టేలా ఉన్నాడు. అంటే రూబీ ఆత్మ ఈ సారి ప్రభుదేవా దేహంలోకి ప్రవేశించిందన్న మాట. రకరకాల గెటప్స్‌లో ప్రభుదేవా కనిపిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్‌తో ప్రభుదేవా రొమాన్స్ చేస్తున్నారు. తమన్నాతో పాటు, నందితా శ్వేతా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
సోనూ సూద్ మరో ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనున్నాడు. విజయ్ ఈ సినిమాకి దర్శకుడు. తమన్నా ఈ ఏడాది 'ఎఫ్ 2'తో మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఈ నెల 31న విడుదల కాబోయే 'అభినేత్రి 2'తో మరో హిట్ కూడా ఖాయమే అనిపిస్తోంది తమన్నాకి. ట్రైలర్ ప్రోమోలు ఆకట్టుకునేలా కట్ చేశారు. కమర్షియల్ అంశాల్ని పుష్కలంగా పొందుపరిచారు. సో 'అబినేత్రి 2'పై అంచనాలు బాగానే ఉన్నాయి. చూడాలి మరి ఆ అంచనాల్ని అందుకుంటుందో లేదో.