తెలుగు సినీ పరిశ్రమలో ఆమెనెవరూ పట్టించుకోకపోవడంతో చెన్నయ్‌కి పారిపోయి, మళ్ళీ ఎందుకో టాలీవుడ్‌కి తిరిగొచ్చిన శ్రీరెడ్డి తన బూతులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ పబ్బం గడుపుకుంటోంది. శేఖర్ కమ్ముల నుంచి కొరటాల శివ వరకూ, పవన్‌కళ్యాణ్ నుంచి వెంకటేష్ వరకూ.. చాలామందిని శ్రీరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే వుంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారంలో శ్రీరెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అసలామెను ఎవరు పట్టించుకున్నట్టు? నరేష్ గెలిచాడు, శివాజీ రాజా ఓడిపోయాడు. గెలుపోటములు సహజం. ఓటు వేసే రోజు శివాజీరాజా, నరేష్ కలిసే వున్నారు. వెయ్యి మంది ఓటర్లు కూడా లేని ఓ అసోసియేషన్‌ని దేశంలోని ఎన్నికల్లా భావించడమే శ్రీరెడ్డి అవివేకాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ ఎన్నికల వెనుకాల 'పున్నమినాగు' వున్నాడంటూ బాంబు పేల్చింది. మెగా కాంపౌండ్ మీద విషం చిమ్మడానికి శ్రీరెడ్డికి ఇదొక అవకాశం అంతేనేమో.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన పవన్‌కళ్యాణ్‌కి, 'మా' ఎన్నికలు గురించి ఆలోచించేంత తీరిక వుందా? పూనమ్ కౌర్ పేరుని లాగి, శ్రీరెడ్డి ఏదో హంగామా చేద్దామనుకుని బురదలో పడింది. తాను బురదలో పడి ఆ బురదని ఎవరో ఒకరి మీదకు విసరాలన్న ఆమె ప్రయత్నం ప్రతిసారీ బెడిసికొడుతోంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టుకునే బూతు ఫొటోలే ఆమె క్యారెక్టర్‌ని అందరికీ పరిచయం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానంటున్న శ్రీరెడ్డికి, అక్కడ మాత్రం పట్టించుకునేవారెవరు దొరుకుతారు?