సెలబ్రిటీలు బయటకి వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్లు నుండి ఇబ్బందులు ఎదురుకోవడం సాధారణంగా మనం చూసే అంశం.
ఇక ఇలాంటిదే ఈమధ్య నటి ఐశ్వర్యా రాయికి కూడా ఎదురైంది. అయితే ఆ సమయంలో ఆమె భర్త అభిషేక్ బచ్చన్ ఉండడంతో అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లకి వార్నింగ్ ఇచ్చాడట.
వివరాల్లోకి వెళితే, ఐశ్వర్యా రాయి-అభిషేక్ బచ్చన్ కలిసి ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీకి వెళ్ళడంతో అక్కడ ఫోటోగ్రాఫర్లు ఐశ్వర్యా రాయి కారులోకి ఎక్కే సమయంలో ఇబ్బందికరంగా ఉండే ఫోటోలు తీయడంతో అభిషేక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అయితే ఇలా బెదిరించడం తప్పు అని కొంతమంది అదే సమయంలో మరికొంతమంది ఇలా అవతలి వారి వ్యక్తిగత స్వేచ్చకి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం తప్పే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు.