చాలా కాలం గ్యాప్ తర్వాత 'గరుడవేగ' సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో రాజశేఖర్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుందీ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తేనేమి. కంటెన్ట్ ఉన్న సినిమాతో వచ్చాడు. అందుకే ప్రజలు పట్టం కట్టారు. మంచి హిట్‌ని రాజశేఖర్‌కి కట్ట బెట్టారు. దాంతో నూతన ఉత్సాహం అందుకున్నాడు రాజశేఖర్. హీరోగా కెరీర్ ఎండ్ అయిపోయింది.
ప్రజలు ఇక తనను మర్చిపోయారు అనుకున్న టైంలో వచ్చిన సూపర్ హిట్ 'గరుడవేగ'. ఇలాంటి టైంలో హిట్ వస్తే ఆ ఆనందం, ఉత్సాహం ఎలా ఉంటాయో, రాజశేఖర్‌ని చూస్తేనే తెలుస్తోంది. ఆయన ఆనందానికి అవధులే లేవు. ఇదిలా ఉండగా, ఇంత మంచి విజయం అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ చేస్తానంటున్నారు రాజశేఖర్. సినిమాలో రాజశేఖర్ 'ఎన్ఐఏ' అధికారిగా నటించారు. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. హాలీవుడ్ స్థాయిలో టెక్నికల్ వేల్యూస్ ఆకట్టుకున్నాయి. దాంతో అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువే ఈ సినిమాకి ఖర్చయ్యింది.
అయినా కానీ ఫలితం దక్కడంతో మరింత భారీ అంచనాలతో ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని భావిస్తున్నారట రాజశేఖర్. త్వరలోనే ఆ పూర్తి వివరాలు తెలియజేయనున్నారట. చిన్న హీరోలతో సినిమాలు తెరకెక్కించి, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రవీణ్ సత్తారు చేసిన పెద్ద ప్రయత్నం 'గరుడవేగ'. ఆ ప్రయత్నం ఫలించింది. మంచి ఫలితాన్ని అందించింది. పూజా కుమార్, శ్రద్ధాదాస్ హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాలో. మరి ఈ సినిమా సీక్వెల్‌కి అతి త్వరలోనే రంగం సిద్ధం చేస్తారేమో చూడాలిక.