అఖిల్‌ కోసం ఎన్టీఆర్‌.!

By iQlikMovies - January 18, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

అక్కినేని రాకుమారుడు అఖిల్‌ తాజా చిత్రం 'మిస్టర్‌ మజ్ను' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి ముఖ్య అతిధిగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ విచ్చేయనున్నాడు. ఈ నెల 19న హైద్రాబాద్‌లో జరగబోయే 'మిస్టర్‌ మజ్ను' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి జె.ఆర్‌.సి కన్వెన్షన్‌ వేదిక కానుంది. కాగా అఖిల్‌ నటిస్తున్న మూడో చిత్రమిది. రెండో చిత్రం 'హలో' కోసం మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు.

 

ఆ సినిమా ఓ మోస్తరు సక్సెస్‌ని అందుకుంది. కానీ అఖిల్‌కి కావల్సిన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు 'మిస్టర్‌ మజ్ను'పైనే అఖిల్‌ ఆశలన్నీ. ఎలాగైనా ఈ సినిమాతో హీరోగా తన స్టామినా చూపించాలనే కసితో ఉన్నాడు అఖిల్‌. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. 'సవ్యసాచి'తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

 

నిధి అగర్వాల్‌కి కూడా మిస్టర్‌ మజ్ను సినిమా విజయం ఎంతో కీలకం. తొలి సినిమాతోనే గుడ్‌ అప్పీల్‌ అంటూ ఈ ముద్దుగుమ్మ చర్చల్లో నిలిచింది. కానీ 'సవ్యసాచి' విజయం ఆమెను రేస్‌ నుండి పక్కకు నెట్టేసింది. ఈ సినిమా అయినా సక్సెస్‌ అయితే అఖిల్‌తో పాటు నిధికి కూడా అదృష్ట నిధి దక్కినట్లే. తమన్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. బివియస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS