కరోనా గడగడ లాడిస్తున్న సమయంలోనూ టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిఖిల్ కూడా ఓ ఇంటి వాడయ్యాడు. ఆగస్టు 8న మన భళ్లాల దేవ రానా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు నితిన్ వంతు వచ్చింది. షాలినిని నితిన్ ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ లోనే పెళ్లి జరగాల్సింది.
కానీ కరోనా వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు నితిన్ పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ నెల 26న నితిన్ వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో నితిన్, షాలినిల వివాహం జరగనుంది. ఈ పెళ్లి చాలా సింపుల్ గా చేయాలనుకుంటున్నార్ట. అతిథుల లిస్టు కూడా తక్కువగానే ఉంది. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరవాత.. ఇండ్రస్ట్రీ పెద్దలకు, స్నేహితులకు నితిన్ భారీ విందు ఇవ్వబోతున్నట్టు సమాచారం.