అల్లు అర్జున్ నటించిన `రేసుగుర్రం`తో విలన్ గా మంచి మార్కులు తెచ్చుకున్ఆడు రవికిషన్. ఆ తరవాత... సుప్రిమ్ లాంటి సినిమాలతోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ నటుడికి కరోనా సోకిందని టాక్. తన వ్యక్తిగత కార్యదర్శికి కరోనా సోకింది. దాంతో.. రవికిషన్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని స్వయంగా నటుడు రవికిషన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. `నా దగ్గర పీఏగా పని చేస్తున్న 42 ఏళ్ల గుడ్డూ పాండే గత కొన్ని రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేయించగా టెస్టుల్లో అతనికి కరోనా సోకినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నాం. అతను త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను` అన్నారు రవికిషన్.
అన్నట్టు రవికిషన్ ఎంపీ కూడా. గోరఖ్ పూర్ నియోజక వర్గం నుంచి బీజేపీ నుంచి గెలుపొందారు.ఒకప్పటి అందాల తార నగ్మాతో ఆయన సహజీవనం చేసినట్టు అప్పట్లో చెప్పుకున్నారు కూడా. ఆ విధంగా ఆయన పాపులరే.