షాక్‌: లైవ్‌లో బూతులు తిట్టిన శివాజీ

మరిన్ని వార్తలు

టీవీ ఛాన‌ళ్లు నిర్వ‌హించే లైవ్ డిబేట్లు నానా రాద్ధాంతానికి వేదిక‌గా మిగిలిపోతున్నాయి. డిబేట్‌కి వ‌చ్చిన‌వాళ్లు బూతులు తిట్టుకోవ‌డం, కొట్టుకోవ‌డం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడూ అలాంటిదే జ‌రిగింది. కాక‌పోతే... డిబేట్‌కి వ‌చ్చిన వ్య‌క్తి.. లైవ్‌లో కాల‌ర్‌తో గొడ‌వ పెట్టుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

 

 

వివ‌రాల్లోకి వెళ్తే.. న‌టుడు శివాజీ ఈమ‌ధ్య రాజకీయాల్లో ఎగ్రెసీవ్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని వివాదాలూ, కేసుల పుణ్య‌మా అని ఆయ‌న కొంత‌కాలం ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పోయారు. నిన్న‌నే (శనివారం) ఓ ఛాన‌ల్ నిర్వ‌హించ‌న లైవ్‌లో పాల్గొన్నారు. మూడు రాజ‌ధానుల స‌మ‌స్య కోసం ఆయ‌న ప్ర‌స్తావిస్తున్న‌ప్పుడు లైవ్‌లో ఓ వీక్ష‌కుడు ఫోన్ చేశాడు.

 

శివాజీని టార్గెట్ చేసుకుని మాట్లాడాడు. పిన్ని కూతుర్ని లేపుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్న‌వాడితో లైవ్ ఏమిటి? అంటూ ఛాన‌ల్ వాళ్ల‌ని ప్రశ్నించాడు. దాంతో శివాజీకి భీక‌ర‌మైన కోపం వ‌చ్చి.. లైవ్‌లోనే కాల‌ర్‌ని బూతులు తిట్టాడు. మిమ్మ‌ల్ని బాగు చేయ‌డానికి వ‌స్తే, నాపై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేస్తావా అంటూ రాయ‌లేని భాష‌లో తిట్టాడు. దాంతో కాసేపు ఆ కార్య‌క్ర‌మం ర‌సాభ‌స‌గా మారింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఈ చాన‌ల్‌లో జ‌రిగిన వ్య‌వ‌హార‌మే హాట్ టాపిక్‌గా మారింది. సెల‌బ్రెటీలు లైవ్‌లోకి వెళ్లాలంటే గ‌జ‌గ‌ణ వ‌ణికి పోతున్నారంటే కార‌ణం ఇదే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS