టాలీవుడ్ లోనే క్రియేటీవ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొన్నాడు సుకుమార్. తనతో సినిమాలు చేయాలని, కలసి పని చేయాలని చాలామంది హీరోలు ఎదురు చూస్తుంటారు. అయితే... సుకుమార్ కథని రిజెక్ట్ చేసినవాళ్లూ ఉన్నారు. సాయిధరమ్ తేజ్, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్.. వీళ్లంతా సుకుమార్ కథకి `నో` చెప్పారంటే నమ్ముతారా? కానీ అదే జరిగింది.
సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన `18 పేజెస్` ఈ శుక్రవారం విడుదలైంది. నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమా అంతా సుకుమార్ స్టైల్ లో నీట్‌గా సాగిందని, ఫీల్ గుడ్ ఎమోషన్ ఉన్న సినిమా అని అంతా కితాబులు ఇస్తున్నారు. ఈ సినిమాతో నిఖిల్ ఖాతాలో మరో హిట్టు పడినట్టే. కానీ.. ఇదే కథని తేజ్, నాని, శర్వా, వరుణ్ వీళ్లంతా రిజెక్ట్ చేశారు. కథ బాగున్నా.. తమకు సరిపడదని పక్కన పెట్టారు. అదే కథతో ఇప్పుడు నిఖిల్ హిట్టు కొట్టాడు. అదృష్టమంటే నిఖిల్‌దే కదా?! కార్తికేయతో 2022లో ఓ మంచి విజయాన్ని అందుకొన్న నిఖిల్... ఈ హిట్ తో 2022ని దిగ్విజయంగా ముగించినట్టైంది. మరి... 18 పేజెస్ రిజెల్ట్ చూసి.. మిగిలిన హీరోలు ఏమనుకొంటున్నారో.. ఏంటో..?