తొలి సినిమా నుండీ హీరోగా నిలదొక్కుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు అక్కినేని బుల్లోడు అఖిల్‌కి. కానీ, చేసిన ప్రతీ ప్రయత్నం బెడిసికొడుతూనే ఉంది. వరుస ఫ్లాపులు అఖిల్‌ని నిరాశపరుస్తున్నాయి. ఎంట్రీ గ్రాండ్‌గా ఉన్నప్పటికీ సక్సెస్ మాత్రం దగ్గర కావడానికి చాలా కష్టపెడుతోంది అఖిల్‌ని. తాజాగా అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ కొనసాగిస్తున్న వేట అంతా ఇంతా కాదు. ఈ మధ్యనే 'అఖిల్‌కి హీరోయిన్ దొరికిందోచ్..' అంటూ ప్రచారం జరిగింది.
అయితే, అది కూడా తూచ్ అయిపోయిందని తెలుస్తోంది. బాలీవుడ్ భామల కోసం ప్రయత్నాలు చేసి చేసి, ఆఖరికి టాలీవుడ్‌కే ఫిక్సయ్యారు. కానీ ఏమాత్రం తగ్గలేదు సుమీ. క్రేజీయెస్ట్ అండ్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌తో డీల్ కుదుర్చుకున్నారు. ఆమె ఎవరో కాదు, పూజాహెగ్దే. అయితే, పూజా హెగ్దే, అఖిల్‌కి హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది. దాంతో మళ్లీ అఖిల్ హీరోయిన్ ఇష్యూ చిక్కుల్లో పడింది. ఇక హీరోయిన్ విషయంలో విసిగిపోయిన నాగార్జున అండ్ టీమ్ ఎట్టకేలకు ఓ కొత్త భామకు ఫిక్సయినట్లు సమాచారమ్ అందుతోంది.
ఆమె మరెవరో కాదు, ఆకాష్ పూరీతో 'రొమాంటిక్' చిత్రంలో నటిస్తున్న బొద్దుగుమ్మ కేతికా శర్మ అని తెలుస్తోంది. అక్కినేని అందగాడితో ఈ సోషల్ మీడియా సెన్సేషన్ కేతికా శర్మకు రొమాన్స్ చేసే ఛాన్స్ నిజంగానే దక్కిందా.? చూడాలిక.