మొన్నటి తరం హీరోయిన్లు రవికల్లో తమ అందాలను చూపించి ప్రేక్షకుల్ని కనువిందు చేసేశారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. వెనక్కి తిరిగొచ్చేసింది. ఇప్పుడా రవికలే న్యూ మోడల్‌గా ధరించి నేటి ముద్దుగుమ్మలు మురిసిపోతున్నారు. చూస్తున్నారుగా తాజా పిక్‌లో ప్రగ్యా జైశ్వాల్ అలాంటి రవికనే ధరించింది. బ్లాక్ డిజైనర్ ఇన్నర్ వేర్ పైన ఉల్లిపొర రకంగులో రవిక మోడల్ని డిజైన్ చేయించింది.
లాంగ్ లెహెంగాకి ఆ రవిక మోడల్ కట్ కొత్తందాన్ని తెచ్చిపెట్టింది. క్లాసిక్ ఎక్స్ప్రెషన్తో తాను ధరించిన ఈ మోడ్రన్ కాస్ట్యూమ్ని హాట్ హాట్‌గా ప్రొజెక్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కి దిల్ ఖుషీ చేస్తోంది ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్. టీఎస్ఆర్ నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్లో ఇలా నిండుగా మెరిసింది అందాల ప్రగ్యా.