క్రేజీ ఐడియా: లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డి.?

మరిన్ని వార్తలు

అదేంటీ.? లక్ష్మీ పార్వతి ఆల్రెడీ దొరికింది కదా. ఈ లక్ష్మీపార్వతి ఎవరనుకుంటున్నారా.? నిజానికి ఎన్టీఆర్‌ బయోపిక్‌లో రెండు పార్ట్‌లు మాత్రమే ఇప్పుడు టాక్‌లో ఉన్నాయి. అసలు ఎన్టీఆర్‌ బయోపిక్‌కి ఆధ్యం మూడు పార్ట్‌లుగా పడిందన్న సంగతిని మర్చేపోయాం. అదేనండీ బాలయ్య ఎన్టీఆర్‌, వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' కాకుండా మూడోది 'లక్ష్మీస్‌ వీరగ్రంధం' మర్చిపోయారా.? అయితే గుర్తు చేసుకోండి. ఎందుకంటే తాజాగా ఈ బయోపిక్‌ ఇప్పుడు తెర పైకి వచ్చింది. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ బయోపిక్‌ని రూపొందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

ఆయనే ఇప్పుడు మళ్లీ మీడియా ముందుకొచ్చి ఈ విషయాన్ని ఇంకోసారి జనానికి గుర్తు చేశారన్న మాట. ఇంతకీ ఈయన రూపొందించే 'లక్ష్మీస్‌ వీరగ్రంధం'లో లక్ష్మీపార్వతి పాత్రలో నటించే నటి విషయంలోనే ఈయన క్రేజీ థాట్‌ చేశారు. కాస్టింగ్‌ కౌచ్‌ పేరు చెప్పి అర్ధ నగ్న ప్రదర్శన చేసి, టాలీవుడ్‌, కోలీవుడ్‌, ఈ వుడ్‌, ఆ వుడ్‌ అనే తేడా లేకుండా అన్ని వుడ్‌ల సినీ ప్రముఖుల్ని కెలికి కెలికి వదిలిపెట్టిన శ్రీరెడ్డిని కూడా ఈ మధ్య మర్చిపోయాం కదా. అందుకే కేతిరెడ్డిగారు తాను రూపొందించబోయే బయోపిక్‌తో పాటు, శ్రీరెడ్డిని కూడా గుర్తు చేశారండోయ్‌. అదేనండీ, డైరెక్ట్‌గా విషయంలోకి వెళ్లిపోదాం. 

 

లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఆయన శ్రీరెడ్డిని ఎంపిక చేసుకున్నారట. శ్రీరెడ్డి కూడా ఓకే చేసిందట. ఎందుకు ఓకే చేయదు, అసలే కరువు మీద ఉంది. ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటుంది. అలాంటిది ఇలాంటి కాంట్రవర్సీ సబ్జెక్ట్‌ అంటే నో అనడమా.? నో ఛాన్స్‌. ఇకపోతే ఈ బయోపిక్‌లో వీరగ్రంధం వెంకట సుబ్బారావు (లక్ష్మీపార్వతి మొదటి భర్త) జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మీపార్వతి, తర్వాత ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా అడుగుపెట్టింది.? తర్వాతి రాజకీయ పరిణామాలను ఈ బయోపిక్‌తో చూపించనున్నారట. అదీ సంగతి. వావ్‌ ఇట్స్‌ క్రేజీయా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS