మాజీ హీరోయిన్, సినీ నటి రోజా.. సినిమాల్లో తిరిగి నటించే విషయమై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా బాద్యతలు నిర్వహిస్తూ, నగిరి ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రత్యేక శద్ధ చూపుతోన్న రోజా, తీరిక చూసుకుని బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ అలాగే పలు షోలతో హల్ చల్ చేస్తున్నారు. వెండితెరపై ఎన్ని ఆఫర్లు వచ్చినాసరే, సింపుల్‌గా ‘నో’ చెప్పేస్తున్నారట రోజా.
తాజాగా ఓ బిగ్ బ్యానర్ నుంచి రోజాకి సూపర్బ్ ఆఫర్ వచ్చిందనీ, పవర్ ఫుల్ పొలిటీషియన్ రోల్ కోసం ఆమెను సంప్రదిస్తే, నెగెటివ్ షేడ్స్ వున్నాయన్న కోణంలో ఆమె ఆ ఆపర్‌ని తిరస్కరించారనీ చెబుతున్నారు. బుల్లితెరకు సమయం కేటాయిచగలనుగానీ, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలకు సమయం కేటాయించడం కష్టమని, ఆ కారణంగానే సినిమాలు చేయలేకపోతున్నానని పలు సందర్భాల్లో రోజా స్పష్టతనిచ్చేశారు.
అయితే, కొన్ని ప్రత్యేక పాత్రల కోసం ఇతర భాషల నుంచి సీనియర్ నటీమణుల్ని నానా కష్టాలూ పడి దించుతోన్న టాలీవుడ్, కోలీవుడ్.. లోకల్ టాలెంట్ అయిన రోజాని మాత్రం ఒప్పించలేకపోతున్నారు. రోజా గనుక ‘సై’ అంటే, కొత్త ఇన్నింగ్స్‌లో ఆమె వెండితెరపై అదరగొట్టేస్తారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే, రాజకీయాలు.. సినిమాల్ని బ్యాలెన్స్ చేయడం కష్టమని భావిస్తోన్న ఆమె ఆలోచనని తప్పు పట్టలేం.