ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఆచార్య’ సినిమా సెట్‌లోకి అడుగు పెట్టేశాడు. ‘ఆచార్య’ సినిమాని రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌లో మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ దశలో చరణ్ స్థానంలో మరో హీరోని తీసుకోవాలని ‘ఆచార్య’ టీమ్ భావించింది. ఆ పాత్ర తాను చేస్తానంటూ మహేష్‌బాబు ముందుకొచ్చినట్లు కొరటాల శివ చెప్పడం గమనార్హం.
అయితే, చిరంజీవి సతీమణి సురేఖ కోరిక మేరకు, చరణ్ ‘ఆచార్య’లో కీలక పాత్ర చేయాలనుకున్నాడట.. చేస్తున్నాడు కూడా. చరణ్, సెట్స్‌లోకి అడుగు పెట్టడంతో ‘ఆచార్య’ సినిమాకి అదనపు మెగా గ్లామర్ లభించింది. కాగా, చరణ్‌ది కేవలం అథిది పాత్ర మాత్రమే కాదనీ, సినిమాలో అతనిది కీలక పాత్ర అని దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. కాగా, అతి త్వరలో చరణ్ జోడీ కూడా ‘ఆచార్య’ సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఓ హ్యాపెనింగ్ బ్యూటీ ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్‌గా నటించబోతోంది.
ఆమె ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మరో ఇంటరెస్టింగ్ గాసిప్ ఏంటంటే, ఈ సినిమాలో చరణ్‌కి ఓ సోలో సాంగ్ వుంటుందనీ, చిరంజీవితో కలిసి ‘అమ్మడు కుమ్ముడు’ తరహా మాస్ సాంగ్ ఒకటీ వుండబోతోందని తెలుస్తోంది.