'ఇంకొక్క ఛాన్స్‌..' పాత హీరోయిన్‌ మళ్లీ వస్తోంది!

మరిన్ని వార్తలు

'ఒక్క ఛాన్స్‌.. ' అంటూ కృష్ణవంశీ 'ఖడ్గం' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ సంగీత. అంతకు ముందే సినిమాల్లో పరిచయమున్నప్పటికీ, ఆ సినిమాతోనే సంగీతకు పాపులారిటీ దక్కింది. ఆ తర్వాత 'పెళ్లాం ఊరెళితే', 'సంక్రాంతి' తదితర చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పెళ్లి చేసుకుని, ఓ పాపకు తల్లయ్యింది. ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. మొన్నామధ్య మధ్య తల్లీ - కూతుళ్ల గొడవతో వార్తల్లోకెక్కింది. ఆ గొడవ సద్దుమనిగినట్లే ఉందిప్పుడు. ఇక భర్త, పాపతో పర్సనల్‌ లైఫ్‌ని సంతృప్తికరంగా లీడ్‌ చేస్తున్న సంగీత ఇప్పుడు కెరీర్‌ని కూడా ప్రొఫిషనల్‌గా రన్‌ చేయాలనుకుంటోందట. మంచి పాత్రలు దక్కితే సెకండ్‌ ఇన్నింగ్స్‌కి సై అంటోంది.

 

హీరోయిన్‌గా ఉన్నప్పుడే ఎన్నో విలక్షణ పాత్రలు పోషించింది. గ్లామర్‌, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌, నెగిటివ్‌ షేడ్స్‌ ఇలా పలు రకాల పాత్రల్లో సంగీత ఆకట్టుకుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా పాత్ర నచ్చితే, ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉన్నానంటోంది. తెలుగులో సీనియర్‌ భామలు ఇప్పటికే రీ ఎంట్రీలిస్తూ, ఆయా సినిమాలతో ఆశక్తి కనబరుస్తున్నారు. అలాగే సంగీత కూడా త్వరలో సినిమాల్లో మెరవాలనుకుంటోందట. అయితే, ప్రస్తుతానికేమీ ఆమె చేతిలో ఆఫర్లు లేవు. కానీ, త్వరలో వచ్చే అవకాశాలు మాత్రం లేకపోలేవు. 'ఒక్కఛాన్స్‌..' అంటూ వచ్చి హీరోయిన్‌గా ఎదిగిన సంగీత మరోసారి ఒక్క ఛాన్స్‌ అంటోంది. ఆ ఛాన్స్‌ ఇచ్చేదెవరో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS