రాజమౌళిని ఒక్క ఛాన్స్‌ అడుగుతోందట!

మరిన్ని వార్తలు

అందాల భామ కేథరీన్‌ బాగా ఓపెన్‌ అయిపోయింది. పాపం ఈ భామ ఎంతో కాలంగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, స్టార్‌డమ్ అనే మాటకు చాలా దూరంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరగా ఉన్నా, సరైన సూపర్‌ హిట్‌ దక్కితేనే కదా.. అసలైన లెక్క. ఆ లెక్కలు తేల్చాలంటే ఓ బంపర్‌ ఆఫర్‌ కొట్టాల్సిందే. అందుకే ఈ హాట్‌ బ్యూటీ పెద్ద ప్లాన్‌ వేసింది. ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఛాన్స్‌ కొట్టేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఇప్పటికే హాట్‌ ఐటెం హంసా నందినికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో పిలిచి అవకాశమిచ్చాడట దర్శకుడు రాజమౌళి. అలాంటి అవకాశం తనకూ వస్తే బావుండని ఈ ముద్దుగుమ్మ ఎదురు చూస్తోందట. ఎదురు చూస్తే దక్కేవి ఎదురు చూపులే కానీ, అవకాశాలు కావు.. అని గ్రహించిన ఈ భామ ఇంకో అడుగు ముందుకేసి, రాజమౌళిని అడిగేసిందట.

 

నిడివితో సంబంధం లేదు, ఒకే ఒక్క ఛాన్స్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఇప్పించమని కోరిందట. అంత క్యూట్‌గా కేథరీన్‌ అడిగేసేసరికి జక్కన్న అంతటోడైనా ఫ్లాట్‌ అయిపోడూ. ఏమో అయినా అయిపోయి ఉండొచ్చు. కేథరీన్‌ కోసం ఓ చిన్న క్యారెక్టర్‌ డిజైన్‌ చేయించేసినా చేయించేయొచ్చు. ఒకవేళ అదృష్టం చిక్కి అనుకున్నట్లు ఆ ఛాన్సేదో దక్కించుకుందంటే, పాప కల నెరవేరినట్లే. ప్రస్తుతం కేథరీన్‌ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాలో విజయ్‌ దేవరకొండకు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS