అస‌లు కార‌ణం ఇదేన‌ట‌!

మరిన్ని వార్తలు

మ‌హేష్‌బాబు - సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కాల్సివుంది. అటు మ‌హేష్‌కీ, ఇటు సుకుమార్‌కీ అడ్వాన్సులు ఇచ్చేసింది మైత్రీ మూవీస్‌. కానీ ఈ సినిమా ఇప్పుడు వాయిదా ప‌డే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతానికి మ‌హేష్ - సుకుమార్ కాంబో ఆగిపోయింద‌ని టాలీవుడ్‌లో ఓ టాక్ న‌డుస్తోంది. 

 

మ‌హేష్‌కి సుకుమార్ ఇంకా క‌థ చెప్ప‌లేద‌ని, క‌థ త‌యారు చేసి, పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేయ‌డానికి సుకుమార్ త‌గిన స‌మ‌యం అడుగుతున్నాడ‌ని, అందుకే.. ప్ర‌స్తుతానికి ఈ సినిమా ప‌క్క‌న పెట్టార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అస‌లు కార‌ణం మ‌రోటి ఉంద‌ట‌. సుకుమార్ క‌థ చెప్ప‌లేద‌న్న‌మాట‌ల్లో వాస్త‌వం లేద‌ని, నిజానికి సుకుమార్ క‌థ చెప్పేశాడ‌ని, అయితే ఆ క‌థ మ‌హేష్‌కి న‌చ్చలేద‌ని స‌మాచారం. 

 

మ‌హేష్ కొన్ని మార్పులూ చేర్పులూ చెప్పాడ‌ని, సుకుమార్ మాత్రం ఆ మార్పుల‌కు అంగీక‌రించ‌లేద‌ని, అందుకే ఈ సినిమా ఆగిపోయింద‌ని తెలుస్తోంది. మ‌రి సుకుమార్ పూర్తిగా ఈ క‌థ ప‌క్క‌న పెట్టేసి, మ‌హేష్ కోసం మ‌రో క‌థ త‌యారు చేస్తాడా?  లేదంటే.. ఇదే క‌థ‌ని మ‌రో హీరోతో తెర‌కెక్కిస్తాడా? అనేది ప్ర‌స్తుతానికి ఆస‌క్తి రేకెత్తిస్తోంది. రంగ‌స్థ‌లం లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇచ్చిన త‌ర‌వాత సుక్కుతో సినిమా చేయ‌డానికి ఎవ‌రైనా స‌రే.. రెడీ అయిపోతారు. మ‌హేష్ కాక‌పోతే.. ఈ క‌థ మ‌రొక‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం ఖాయం. మ‌రి ఆ హీరో ఎవ‌రో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS