సుకుమార్‌ వెనక్కి, అనిల్‌ ముందుకి.!

మరిన్ని వార్తలు

'రంగస్థలం' సినిమా బ్లాక్‌ బస్టర్‌ తర్వాత సుకుమార్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో సినిమాకి ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సుకుమార్‌ అదిరిపోయే స్క్రిప్టు కూడా సిద్ధం చేశాడు. అయితే తాజాగా ఈ కాంబో విషయమై ఓ ఆశక్తికరమైన గాసిప్‌ వినిపిస్తోంది. మహేష్‌ సినిమాకి దర్శకుడు సుకుమార్‌ కాదట. అనిల్‌ రావిపూడి అట అని ప్రచారం జరుగుతోంది. సుకుమార్‌తో సినిమా అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. 

 

అనిల్‌ అయితే త్వరగా సినిమాని కంప్లీట్‌ చేస్తాడనే యోచనలో మహేష్‌బాబు సుకుమార్‌ని పక్కన పెట్టాడట. గతేడాది 'భరత్‌ అనే నేను' సినిమాతో హిట్టులాంటి హిట్‌ అందుకున్నాడు మహేష్‌బాబు. కానీ అది సరిపోదు. ఈ ఏడాది ఆల్రెడీ 'మహర్షి' సినిమాతో సూపర్‌ హిట్టుపై కన్నేశాడు. ఇది జరిగేనో లేదో తెలియాలంటే సినిమా విడుదలై ఫైనల్‌ వర్డిక్ట్‌ ఆడియన్స్‌ నుండి వస్తే కానీ తెలీదు. 

 

ఇక తాజాగా సర్క్యులేట్‌ అవుతోన్న గాసిప్‌ని బట్టి చూస్తే ఫ్యాన్స్‌ని మరింత సంతృప్తి పరిచేందుకు మహేష్‌బాబు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడనిపిస్తోంది. అనిల్‌ రావిపూడి సంక్రాంతికి 'ఎఫ్‌ 2'తో దిమ్మ తిరిగే హిట్టు కొట్టి ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. సో అది దృష్టిలో పెట్టుకునే మహేష్‌ ఈ ఆలోచన చేశాడా.? ఏమో ఈ గాసిప్‌లో నిజమెంతో తెలీదు కానీ, సుకుమార్‌ని మహేష్‌ పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నాడంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS