గ్లామ్‌షాట్‌: గ్లామర్‌, హారర్‌ 'హార్ట్‌ ఎటాక్‌' తెప్పించేసింది.!

By iQlikMovies - January 04, 2019 - 14:44 PM IST

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మలు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతే కాదండోయ్‌, సమాజానికి ఉపయోగపడే సందేశాలను కూడా ఇస్తున్నారు అప్పుడప్పుడూ. మొన్నామధ్య ఆదాశర్మ ధూమపానం చేస్తే ఏమవుతుందో అనే విషయాన్ని అందంగా చూపిస్తూ ట్రాజెడీ మిక్స్‌ చేసి వీడియో రూపంలో చూపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ హాట్‌ బ్యూటీ మరో వీడియో పోస్ట్‌ చేసింది. ఈ సారి మధ్యం సేవించడంపై ఆదాశర్మ తనదైన విలక్షణతను చూపించింది. 

 

ముందుగా హాట్‌ హాట్‌గా తన అందంతో బెల్లీ డాన్స్‌ వేసి చూపించింది. డ్రింకింగ్‌ తర్వాత ఎంత క్రూరంగా మారిపోయిందో. చివరికి ఎలా చనిపోయిందో సింపుల్‌గా కొన్ని సెకన్ల వీడియోతో చెప్పేసింది. తెలుగులో 'హార్ట్‌ ఎటాక్‌' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా గడుపుతోంది. సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే ఆదాశర్మ, ఈ మధ్య ఇలాంటి అవేర్‌నెస్‌ వీడియోలతోనూ కిర్రాకు పుట్టిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS