శంకర్ సినిమాలంటే చాలా రోజులు షూటింగ్ జరుపుకుంటాయనే భావన ఉందింతవరకూ. కానీ శంకర్ ఇప్పుడు మారిపోయారు. తొందరగా షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారట. అనుకున్న టైంకే షూటింగ్‌కి ప్యాకప్ చెప్పాలనుకుంటున్నారట. ఇటీవలే 'రోబో 2.0' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన శంకర్ తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
కమల్‌హాసన్‌తో 'ఇండియన్ 2' చిత్రాన్ని శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విషయంలో శంకర్ కొన్ని హద్దులు కేటాయించుకున్నారట. ఖచ్చితంగా నాలుగు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. ఈ నెల 18 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కమల్‌హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే.
అందులో తండ్రి సేనాపతి పాత్రకు మేకప్ అత్యంత కీలకం. సో ఆ పాత్రకు సంబంధించిన మేకప్ ఆర్టిస్టులను ఇటీవల అమెరికా నుండి రప్పించారు. ఆల్రెడీ స్క్రీన్ టెస్ట్‌లు కూడా జరిగాయి. పర్ఫెక్ట్గా మేకప్ వచ్చిందట. ఇక మరికొద్ది రోజుల్లోనే సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపొందనుంది.