ముద్దుగుమ్మ ఆదాశర్మకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల ద్వారా ఈ ముద్దుగుమ్మకి వచ్చిన పాపులారిటీ ఏ పాటిదో పక్కన పెడితే, సోషల్ మీడియాలో తన క్రియేటివిటీకి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ పిక్స్‌తో పాటు, అంతకన్నా హాట్ హాట్ వర్కవుట్స్‌తో ఆదాశర్మ ఫ్యాన్స్‌కి ఎప్పటికప్పుడే కొత్త కిక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఆదా లేటెస్టుగా ఏం చేసిందో తెలుసా?
ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ 'ఫిట్‌నెస్ ఛాలెంజ్'. ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కి సినీ సెలబ్రిటీసే కాదు, క్రికెట్ సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్ ఇలా ఏ ఒక్కరూ అతీతులు కాకుండా, సోషల్ మీడియా వేదికగా, తమకు నచ్చిన వారికి ఛాలెంజ్ విసురుతున్నారు. అందులో భాగంగా మన యోగా బ్యూటీ ఏం చేసిందో తెలుసా? చీరకట్టులో వర్కవుట్స్ చేసి, సవాల్ విసిరింది. పాత కాలం నాటి ముద్గల్‌తో చీర కట్టులో ఆదా చేసిన వర్కవుట్స్‌కి నెటిజన్లు ఫిదా అవ్వడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు.
అంతేనా? ఆదానా మజాకానా? ఇన్నోవేటివ్ థాట్స్‌లో ఆదా తర్వాతే ఇంకెవరైనా అని కూడా అనకుండా ఉండలేకపోతున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెసరీస్‌ను వాడడంతో పాటు, డిఫరెంట్ యోగాసనాలు వేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రెగ్యులర్‌గా ఆదాశర్మ చేస్తుంటుంది.
తాజాగా తాను చేసిన ఈ పిట్‌నెస్ ఛాలెంజ్‌తో ఆదా ఈజ్ సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకుంటోంది. నేను ఇండియన్‌ని కాబట్టి, ఇండియన్ అమ్మాయిగా చీరకట్టులో నేను వర్కవుట్స్ చేశాననీ, దీనిపై పేట్ అండ్ హక్కులు తనకే ఉన్నాయనీ, తననెవరూ కాపీ కొట్టొద్దని కొట్టిచ్చినట్లుగా ప్రకటించింది ఆదాశర్మ.