యంగ్ హీరో అడివి శేష్, తన పెళ్ళిపై వస్తున్న పుకార్లను కొట్టి పారేశాడు. సినిమాల్లో తాను బిజీగా వున్నాననీ, నటనతోపాటు రచన, దర్శకత్వంపై మాత్రమే ఇష్టంతో వున్నాననీ, సినిమా తప్ప మరో ఆలోచన తాను చేయడంలేదని అడివి శేష్ స్పష్టం చేశాడు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, తన పెళ్లి గురించిన వస్తున్న పుకార్లలో నిజం లేదని చెప్పాడు.
పవన్‌కళ్యాణ్ తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'లో హీరోయిన్‌గా నటించిన సుప్రియ (నాగార్జున మేనకోడలు), అడివి శేష్ మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందనీ, ఇద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటవబోతున్నారంటూ గాసిప్స్ వినిపించిన సంగతి తెల్సిందే. అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' సినిమాలో సుప్రియ ఓ కీలక పాత్రలో నటించారు. అయితే అంతమాత్రాన ఇద్దరికీ మధ్య ఎఫైర్ నడుస్తోందనే ప్రచారాన్ని ఎలా నమ్మగలం? అంటూ ఇరువురు సన్నిహితులూ పేర్కొంటున్నారు. అడివి శేష్ క్లారిటీ ఇవ్వడంతో ఇక్కడితో ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడ్డట్లే.
అడివి శేష్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై కాన్సన్‌ట్రేషన్ చేసి వున్నాడు. కొత్త సినిమాకి సంబంధించిన డిటెయిల్స్ చెప్పే క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఈ యంగ్ హీరో ఉత్కంఠను పెంచేస్తున్నాడు. 'ఆ సినిమా డిటెయిల్స్ ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ నాకున్నాయి' అంటూ సస్పెన్స్‌ని కొనసాగిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఆ సినిమా సస్పెన్స్ కూడా ఈ గాసిప్స్‌కి కారణమని కొందరంటున్నారు. 'శుభవార్త చెప్పబోతున్నా' అని అడివి శేష్ గతంలో చేసిన ట్వీట్ వల్లే ఇంత దుమారం చెలరేగిందా?