'మేజర్' విడుదల తేదీ!

మరిన్ని వార్తలు

డైనమిక్ హీరో అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పనులను అడవి శేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు శేష్.

 

మేజర్ లో అడవి శేష్ కథానాయకుడిగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న 'మేజర్' కొత్త విడుదల తేదీ ఖరారైయింది. జూన్ 3న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

 

ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో అడివి శేష్ నుదిటిపై గాయంతో కనిపించగా, తాజ్ హోటల్‌కు ఉగ్రవాదులు నిప్పుపెట్టిన విజువల్ స్టన్నింగా కనిపిస్తుంది.

 

శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ హృదయం పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంది. మేజర్ టీజర్ గ్రిప్పింగ్ నేరేషన్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో అద్భుతమనిపించింది.

 

పాన్ ఇండియా సినిమాగా వస్తున్న 'మేజర్'లో మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS