ఆడవి శేష్‌ సినిమాలో రేణూ దేశాయ్‌?

మరిన్ని వార్తలు

నటి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ సతీమణి అయిన రేణూ దేశాయ్‌ ఈ మధ్యనే సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసే యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో రెండు సినిమాలకు సైన్‌ చేసింది కూడా. ఇంతవరకూ ఎన్ని ఛాన్సులొచ్చినా, నటనపై పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపని రేణూ దేశాయ్‌, ఇటీవలే మనసు మార్చుకుని మళ్లీ ముఖానికి మేకప్‌ వేసుకోవాలనే ఆలోచన చేస్తోంది. హీరోయిన్‌గా పవన్‌ కళ్యాణ్‌తో కలిసి కేవలం రెండు సినిమాల్లోనే నటించినా, పవన్‌ నటించిన చాలా సినిమాలకు ఎడిటింగ్‌ ఫీల్డ్‌లోనూ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసిన అనుభవం ఆమెకుంది. యాక్టింగ్‌ కంటే, టెక్నికల్‌ ఫీల్డ్‌లో ఉండడానికే తనకు ఎక్కువ ఆసక్తి అని గతంలో చాలా సార్లు రేణూ దేశాయ్‌ చెప్పింది.

 

'ఇష్క్‌ వాలా లవ్‌' అనే ఓ మరాఠీ చిత్రానికి డైరెక్షన్‌ కూడా చేసింది రేణూ దేశాయ్‌. ఇకపోతే, తాజాగా రేణూ దేశాయ్‌ యాక్టింగ్‌పై ఆసక్తి పెట్టడంతో, పలు క్యారెక్టర్లు ఆమె కోసం సిద్ధమవుతున్నాయట. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ ఫోటోతో ఆమె ఓ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇంతకీ ఆ ఫోటో ఏంటంటారా.? అడవి శేష్‌తో రేణూ దేశాయ్‌ దిగిన ఫోటో అది. యంగ్‌ మల్టీ టాలెంటెడ్‌ అడవి శేష్‌, లేటెస్ట్‌గా రేణూ దేశాయ్‌ని కలిశాడట.

 

ఓ స్టోరీ లైన్‌ వినిపించే క్రమంలోనే రేణూ దేశాయ్‌ని అడవి శేష్‌ కలిసుంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా 'ఎవరు' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అడివి శేష్‌, త్వరలోనే మరో విలక్షణ కథనానికి కాలు దువ్వుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆ సరికొత్త కథలో, రేణూ దేశాయ్‌ని భాగం చేయాలనుకుంటున్నాడట. ఆ క్రమంలోనే రేణూ ఇంటికి అడవి శేష్‌ వెళ్లాడనీ తెలుస్తోంది. రేణూ దేశాయ్‌తో పాటు, ఆమె కుమారుడు అకీరానందన్‌ కూడా అడవి శేష్‌తో హుషారుగా ఫోటోలకు పోజిచ్చాడు. ఈ ఫోటోలే నెట్టింట్లో ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS