కాజల్‌ జోరుకి బ్రేకుల్లేవ్‌.!

మరిన్ని వార్తలు

చందమామగా తెలుగు ప్రేక్షకులతో ముద్దుగా పిలిపించుకుంటున్న ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌, కెరీర్‌ అప్పుడే డౌన్‌ ఫాల్‌ అయినట్లుగా కనిపిస్తుంది. అంతలోనే పుంజుకుంటుంది. ఆ పుంజుకోవడంలోనూ ఓ రేంజ్‌ ఉంటుంది కాజల్‌కి. టాలీవుడ్‌లో ఇంకేముంది కాజల్‌ పని అయిపోయింది అనుకున్నారంతా. ఆ టైంలో ఎన్టీఆర్‌ నటించిన 'జనతా గ్యారేజ్‌' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేయడం, ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడం, ఆ తర్వాత మెగాస్టార్‌ రీ ఎంట్రీ మూవీలో హీరోయిన్‌గా మెగాస్టార్‌ పక్కన రొమాంటిక్‌ చిందులేసే ఛాన్స్‌ దక్కించుకోవడం.. వరసగా జరిగిపోయాయి.

 

దాంతో మళ్లీ కాజల్‌ కెరీర్‌ మెగా రేంజ్‌లో పట్టాలెక్కేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు కాజల్‌ని పలకరిస్తూనే ఉన్నాయి. ఇటు తెలుగుతో పాటు, తమిళంలోనూ కాజల్‌ అదే జోరు ప్రదర్శిస్తోంది. ఇటీవల 'సీత' రిజల్ట్‌తో కాజల్‌ కాస్త ఢీలా పడింది. కానీ, 'సీత' కాజల్‌లో దాగి ఉన్న నటిని బయటికి తీసింది. సీత పాత్రతో ఆమె భవిష్యత్తులో ఎలాంటి పాత్రనైనా డీల్‌ చేయగలదన్న నమ్మకం ఏర్పడింది ఆడియన్స్‌కి. ఇదిలా ఉంటే, కాజల్‌ నుండి రావల్సిన రెండు, మూడు ప్రాజెక్టులు ఇప్పటికే లైన్‌లో ఉన్నాయి.

 

తమిళ 'క్వీన్‌' - 'ప్యారిస్‌ ప్యారిస్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో మంచు విష్ణు సినిమాలో కాజల్‌ నటిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా కాజల్‌ ఓ బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయ్యిందట. ఈ తరుణంలో కాజల్‌కిది బిగ్‌ ఆఫరే అని చెప్పాలి. సో ఇప్పట్లో కాజల్‌ని కొట్టేవాళ్లే లేరని చెప్పక తప్పదు మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS