'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి, రాజకీయాల్లో మమేకమైపోయాడు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా జనంలో తిరుగుతూ, జనం కోసం పోరాడుతూ జనసేనానిగా మారిపోయాడు. అయితే, సినిమాలకూ పవన్ కళ్యాణ్ అవసరం ఉందని ఎవరెంతగా చెప్పినా పవన్ వినిపించుకోలేదు. కానీ, దిల్‌రాజు, బోనీకపూర్ ద్వయం పుణ్యమా అని మళ్లీ పవన్ కళ్యాణ్‌ని సినిమాల్లోకి లాక్కొస్తున్నారు. దాదాపు 50 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి, పవన్‌తో 'పింక్' రీమేక్ చేస్తున్నారు ఈ నిర్మాతలు. అయితే చాలా తక్కువ డేట్స్ మాత్రమే ఈ సినిమాకి కేటాయించారు పవన్ కళ్యాణ్.
ఆ డేట్స్‌లోపే ఆయనకి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయనుందట చిత్ర యూనిట్. లేటెస్ట్‌గా ఈ సినిమా షూటింగ్‌లోకి పవన్ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమా అంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే అది జరిగే పని కాదనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా కార్యరూపం దాల్చనుందని తెలుస్తోంది. అయితే, 'పింక్' సినిమాలాగే, తక్కువ డేట్స్‌తోనే క్రిష్ సినిమా కూడా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఓ పక్కా ప్లానింగ్‌తో క్రిష్, పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌కి చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒక్కటే. పొలిటికల్ కెరీర్‌కే ఆయన పెద్ద పీట వేస్తున్నారు. సో సినిమాలకు సంబంధించి కంటిన్యూస్ డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా షూటింగ్‌కి హాజరయ్యేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారట.
ఇకపోతే కొన్ని కాంబినేషన్ సీన్స్‌ని పవన్ కళ్యాణ్ లేకుండానే జాగ్రత్తగా డిజైన్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడట క్రిష్. ఏది ఏమైతేనేం, పవన్‌తో సినిమా తీయాలన్న తన కోరిక నెరవేర్చుకోవడమే క్రిష్‌కి కావల్సింది. ఎలాగైనా సినిమాల్లోకి పవన్ రీ ఎంట్రీ ఇవ్వడమే జనానికి కావల్సింది. ఆ రెండూ జరుగుతున్నప్పుడు మిగిలినవన్నీ సెకండరీనే కదా.