హిందీ ‘ఖైదీ’ దొరికేశాడోచ్‌.!

మరిన్ని వార్తలు

తమిళ హీరో కార్తి నటించిన ‘ఖైదీ’ తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయం అందుకుని, ఇరు బాక్సాఫీస్lల వద్ద కాసుల పంట పండిరచిన సంగతి తెలిసిందే. ఒక భాషలో హిట్‌ దక్కించుకున్న సినిమాని ఇతర భాషలోనూ రీమేక్‌ చేయడం పరిపాటిగా మారిన తరుణంలో కార్తి ‘ఖైదీ’ హక్కుల్ని బాలీవుడ్‌ నిర్మాతలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, డబ్బింగ్ మూవీ ఐనా తెలుగులోనూ దుమ్ము దులిపేసిన ఈ సినిమా హిందీ రీమేక్‌ పైనా భారీ అంచనాలుండడంతో ఈ రీమేక్‌లో నటించేందుకు సల్మాన్‌ఖాన్‌, రణ్‌బీర్‌ సింగ్‌ తదితర బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు పోటీ పడ్డారు. ఎట్టకేలకు ఆ ప్రాజెక్ట్‌ యాక్షన్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ చేతికి చిక్కింది.

 

రీమేక్స్‌ని ఇష్టపడే హీరోల వరుసలో అజయ్‌ దేవగణ్‌ కూడా ముందు వరుసలో ఉంటాడు. గతంలో ‘మర్యాద రామన్న’, ‘దృశ్యం’ తదితర తెలుగు చిత్రాలనూ, ‘సింగం’ వంటి తమిళ చిత్రాల హిందీ రీమేక్స్‌లో అజయ్‌ దేవగణ్‌ నటించి సక్సెస్‌ అయ్యాడు. తాజా మూవీ ‘ఖైదీ’తోనూ ఆయన సక్సెస్‌ అవ్వాలని ఆయన ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరోవైపు అజయ్‌ దేవగణ్‌ తెలుగులో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఓ కీలక పాత్ర కోసం దర్శక ధీరుడు రాజమౌళి, అజయ్‌ దేవగణ్‌ని సంప్రదించగా, మారు మాట్లాడకుండా ఆయన ఒప్పుకున్నారు. అందుకే టాలీవుడ్‌కీ ఆయనంటే అంతటి అభిమానం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS