ఆ విషయం మర్చిపోండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై అజయ్‌ క్లారిటీ.!

మరిన్ని వార్తలు

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి సంబంధించి ఇటీవల కొత్తగా ఓ గాసిప్‌ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అదే బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగణ్‌ ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ పోషిస్తున్నాడనీ. ఈ విషయంలో అజయ్‌దేవగన్‌ నుండి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా విషయమై తననెవరూ సంప్రదించలేదనీ, ఈ విషయమై వినిపిస్తున్న టాక్‌లో నిజం లేదనీ అజయ్‌దేవగన్‌ తేల్చేశారు. 

 

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ భారీ బడ్జెట్‌తో, బిగ్‌ కాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న మూవీ కావడంతో, ఈ సినిమాపై రోజుకో రకమైన గాసిప్‌ పుట్టుకొస్తూనే ఉంది. అయితే ఈ గాసిప్‌ మాత్రం ఉత్తదేనని తేలిపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి హీరోయిన్లు మాత్రం సెట్టవ్వడం లేదు. అయితే ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న ఈ తరుణంలో రాజమౌళి హీరోయిన్ల విషయంలో ఇంకా సరిగ్గా కాన్‌సన్‌ట్రేషన్‌ చేయలేదట. 

 

రెండో షెడ్యూల్‌ కంప్లీట్‌ అయ్యాక హీరోయిన్స్‌ విషయంలో ఏదో ఒక క్లారిటీకి వచ్చేయనున్నారనీ తెలుస్తోంది. బాలీవుడ్‌ నుండి ఇద్దరు భామలు అలియాభట్‌, పరిణీతి చోప్రా పేర్లు లిస్టులో ఉన్న మాట కూడా గాసిప్‌గానే కొట్టేస్తారో లేక, నిజమవుతుందో తెలియాలంటే అజయ్‌దేవగన్‌లాగే ఆ భామలు కూడా స్పందించి కన్‌ఫామ్‌ చేసేయాలి. ఏది ఏమైనా రాజమౌళి ఆలోచన బాలీవుడ్‌ దాకా వెళ్లే అవకాశం లేదని టాలీవుడ్‌లో కొందరు గుసగుసలాడుకుంటున్నారు. చూడాలి మరి, 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం దిగి రానున్న ఆ ముద్దుగుమ్మలెక్కడున్నారో.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS