బాలీవుడ్లో 'మెంటల్ హై క్యా' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటిస్తుండగా, కంగనా రనౌత్ హీరోయిన్గా నటిస్తోంది. మరో ముద్దుగుమ్మ అమైరా దస్తూర్ ఇంకో కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడే ఈ ప్రకాష్ కోవెలమూడి. తెలుగులో అనుష్కతో 'సైజ్‌జీరో' సినిమాని తెరకెక్కించాడు. ఇక్కడిదాకా బాగానే ఉంది.
అసలు విషయమేంటంటే, కంగనా ఈ సినిమాలో హీరోయిన్ కదా. అక్కడే అసలు గొడవ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా పోస్టర్స్‌పై తన ఫోటోలే ఎక్కువగా హైలైట్ కావాలని గొడవ చేస్తోందట కంగనా. ఆల్రెడీ గతంలో కొన్ని పోస్టర్లు బయటికి వచ్చాయి. అయితే కొత్తగా మళ్లీ పోస్టర్స్ డిజైన్ చేయాలనీ, వాటిపై హీరో కన్నా, తన ఫోటోనే పెద్దదిగా డిజైన్ చేయాలని డిమాండ్ చేస్తోందట. తన డిమాండ్స్‌కి ఒప్పుకోకపోతే సినిమా నిర్మాణం జరగనివ్వననీ హెచ్చరిస్తోందట. దాంతో చిత్ర యూనిట్ సందిగ్థంలో పడిందట.
బాలీవుడ్లో కంగనా ఫైర్ బ్రాండ్‌గా అభివర్ణించబడుతోందిప్పుడు. ఆమె జోలికి వెళ్లాలంటే బాలీవుడ్ ప్రముఖులే భయపడుతున్నారు. ఇక ఇటీవల కంగనా దెబ్బకి మన టాలీవుడ్ దర్శకుడు క్రిష్ బలైపోయాడు. ఇప్పుడు ప్రకాష్ కోవెలమూడి పరిస్థితి చూస్తుంటే, మరో తెలుగు డైరెక్టర్‌కి కంగనా తలనొప్పిలా మారేలా ఉందనిపిస్తోంది. తెలుగులో ఈ పాప ఒకే ఒక్క సినిమాలో నటించింది. మరో అవకాశం రాలేదనీ, ఒకవేళ అప్పటి నుండీ టాలీవుడ్‌పై కక్ష్య పెంచుకుందో.. ఏమో.? కానీ మన తెలుగు డైరెక్టర్స్‌ని తెగ ఆడేసుకుంటోంది.