సంక్రాంతి సీజ‌న్‌లోనూ పిండేశాయి!

మరిన్ని వార్తలు

2021 బిగ్గెస్ట్ హిట్స్‌లో పుష్ప నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంటుంది. డివైట్ టాక్ వ‌చ్చినా స‌రే, వ‌సూళ్లు కుమ్మేసింది. బాలీవుడ్ లో అయితే ఓ ఊపు ఊపింది. 2021 డిసెంబ‌రులో వ‌చ్చిన అఖండ కూడా అమోఘ‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. బాలయ్య కెరీర్లోనే ఇది ఆల్ టైమ్ రికార్డు వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రం. నిజానికి సంక్రాంతి సీజ‌న్ ముందు వ‌ర‌కే వీటి ప్ర‌తాపం. సంక్రాంతి సీజ‌న్‌లో ఎలాగూ కొత్త సినిమాలు వ‌స్తాయి. అప్పుడు ఇవి సైడ్ అయిపోక త‌ప్ప‌దు. కానీ అదృష్టం ఏమిటంటే.. సంక్రాంతి సినిమాల మ‌ధ్య కూడా పుష్ప‌, అఖండ‌లు కొన్ని వ‌సూళ్లు పిండుకున్నాయి. ఎవ‌రూ ఊహించ‌నంత‌గా ఈ రెండు సినిమాల‌కు రెవిన్యూ వ‌చ్చింది.

 

ఆర్‌.ఆర్‌.ఆర్‌, రాధేశ్యామ్ లేక‌పోవ‌డంతో బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాస్త ఖాళీ దొరికింది. ఇవి రెండూ సంక్రాంతికి వ‌చ్చుంటే, పుష్ప, అఖండ‌ల‌కు థియేట‌ర్లు దొరికేవి కావు. కానీ.. బంగార్రాజుతో పాటుగా కొన్ని థియేట‌ర్ల‌ని పుష్ప‌, అఖండ‌లు పంచుకున్నాయి. దాంతో.. ఈ రెండు సినిమాల‌కు కూడా సంక్రాంతి సీజ‌న్ క‌లిసొచ్చింది. రిపీటెడ్ ఆడియ‌న్స్ రావ‌డం వ‌ల్ల‌.. అఖండ‌, పుష్ప ఆడుతున్న థియేట‌ర్లు కొన్ని హౌస్‌ఫుల్ అయ్యాయి. కొన్ని చోట్ల రౌడీ బోయ్స్‌, హీరో సినిమాల వ‌సూళ్ల కంటే.. ఈ రెండు సినిమాల‌కే మంచి క‌ల‌క్ష‌న్లు వ‌చ్చాయి. ఇది ఎవ‌రూ ఊహించ‌ని రెవిన్యూ. పుష్ప సినిమా ఆల్రెడీ ఓటీటీల్లోకి వచ్చేసింది. అయినా స‌రే, ఆ సినిమా చూడ్డానికి ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తున్నారంటే... అద్భుత‌మే అని చెప్పాలి.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS