ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో స్టార్ వాల్యూ ఉన్న సినిమా బంగార్రాజు మాత్రమే. ఆలస్యంగా మొదలెట్టినా సరే, ప్రమోషన్లు కుమ్మేశారు. ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ సినిమాలు వాయిదా పడడం, బాక్సాఫీసు దగ్గర పెద్ద సినిమాలేవీ లేకపోవడం బంగార్రాజుకి బాగా కలిసొచ్చింది. 14న విడుదలైన బంగార్రాజుకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. సినిమా కలర్‌ఫుల్‌గా ఉంది గానీ, అంతకు మించిన మేటర్ లేదని సమీక్షకులు తేల్చేశారు. అయితే తొలి మూడు రోజుల వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. ఈ మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూలు చేసిందన్నది ట్రేడ్ వర్గాల టాక్.
సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా విడుదల కావడం అతి పెద్ద ప్లస్. మిగిలిన సినిమాల నుంచి పోటీ లేకపోవడం, అవి అన్నీ చిన్న చిత్రాలు కావడం బంగార్రాజుకి అడ్వాంటేజ్ గా మారింది. సంక్రాంతి సీజన్ దాటి, ఈ సినిమా మరో సీజన్ లో విడుదలైతే, అతి పెద్ద డిజాస్టర్ అయ్యేదంటూ.. ట్రేడ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. నిజంగా రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్ విడుదలైతే బంగార్రాజు వచ్చేదే కాదు. కరోనా ఉన్నా, 50 శాతం ఆక్యుపెన్సీ అన్నా సరే నాగ్ రిస్క్ చేయడం మంచి ఫలితాన్నే అందించింది.