టీజర్‌ టాక్‌: 'మిస్టర్‌ మజ్ను'తో కొట్టేలానే వున్నాడు

మరిన్ని వార్తలు

హీరోగా ఇప్పటికే రెండు సినిమాలు చేసిన అక్కినేని అఖిల్‌, మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెలాఖరున 'మిస్టర్‌ మజ్ను' సినిమా విడుదల కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా 'మిస్టర్‌ మజ్ను' టీజర్‌ని విడుదల చేశారు. ఆల్రెడీ ఆడియో సింగిల్స్‌ అందరి దృష్టినీ ఆకర్షించిన దరిమిలా, టీజర్‌పై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అయ్యింది. అలా క్రియేట్‌ అయిన ఇంట్రెస్ట్‌ని ఏమాత్రం డిజప్పాయింట్‌ చేయకుండా టీజర్‌ వచ్చేసింది. 

 

చిలిపి కుర్రాడిలా అఖిల్‌ ఈ టీజర్‌లో కన్పించాడు. అమ్మాయిలతో సరదాగా టైమ్‌ పాస్‌ చేసే నేటి తరం యువకుడిలా కన్పించి మెప్పించిన అఖిల్‌, డాన్సుల్లో ఇరగదీసేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో దుమ్ము రేపేశాడు. డైలాగ్‌ డెలివరీలోనూ మెచ్యూరిటీ కన్పించింది. చిలిపి కుర్రాడు చెప్పే డైలాగులు, మెచ్యూరిటీతో చెప్పే డైలాగులూ ఆకట్టుకుంటున్నాయి. అఖిల్‌ నుంచి ఇప్పటిదాకా వచ్చిన రెండు సినిమాలతో పోల్చితే, ఇందులో ఇంకాస్త 'ఈజ్‌'తో కన్పించాడు. 

 

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ అందంగా కన్పించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెల్సిందే. టీజర్‌ వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని ట్రేడ్‌ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి సినిమా వైఫల్యంతో రెండో సినిమాని 'రీ-ఎంట్రీ'గా అభివర్ణించారు అఖిల్‌ తండ్రి అక్కినేని నాగార్జున. మరి, ఈ 'మిస్టర్‌ మజ్ను' గురించి నాగ్‌ ఏమంటారో!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS