సంక్రాంతికి 'సైరా' కొత్త అప్‌డేట్‌.!

By iQlikMovies - January 02, 2019 - 16:27 PM IST

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే దిమ్మ తిరిగే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు మెగా ఫ్యాన్స్‌కి. చిరంజీవి 151వ చిత్రం 'సైరా' టీజర్‌ విడుదల చేశారు. టీజర్‌కే ఫ్యాన్స్‌ సినిమా చూసినంత తృప్తి ఫీలయ్యారు. అంత బాగా ఆ టీజర్‌ని డిజైన్‌ చేశారు మరి. రికార్డు వ్యూస్‌ కొల్లగొట్టిందా టీజర్‌. ఇక ఇప్పుడు సంక్రాంతి పండగొస్తోంది. సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండగ. అందుకే ఈ పెద్ద పండక్కి మెగా ఫ్యాన్స్‌కి ఓ బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చేందుకు 'సైరా' టీమ్‌ సిద్ధమైందట.

 

కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న 'సైరా' సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ రాబోతోందట సంక్రాంతికి. నిజానికి ఈ సర్‌ప్రైజ్‌ న్యూఇయర్‌ డేకే అంటే జనవరి 1న ఇద్దామనుకున్నారట. కొన్ని ప్రత్యేక కారణాలతో వాయిదా వేశారట. సంక్రాంతికి 'వినయ విధేయ రామ' సినిమా విడుదల కానుంది. దాంతో మెగాఫ్యాన్స్‌ జోరు మీదున్నారు.

 

ఆ జోష్‌ని మరింత పెంచడానికి సంక్రాంతికి ముందే ఓ మంచి టైమ్‌ చూసుకుని సైరా అప్‌డేట్‌ అందించనున్నారట. అయితే అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఆల్రెడీ 'సైరా' టీజర్‌ వచ్చేసింది. చిరంజీవి, నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, తమన్నా ఇలా పలువురి లుక్స్‌ కూడా వచ్చేశాయి. ఇక రాబోయే ఆ సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఏంటన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS