అఖిల్ అక్కినేని హీరోగా చేస్తున్న రెండవ చిత్రం హలో. ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్లు ఇప్పటికే మొదలుపెట్టారు.
అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం హలో చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం వైజాగ్ లో జరగనుంది. ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా అఖిల్ నిలవబోతున్నాడు. ఎందుకంటే ఈ వేడుకలో అఖిల్ పాట పాడడంతో పాటు డాన్స్ కూడా చేయనున్నాడు.
ఇక ఈమధ్యనే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులని బాగా అలరించింది. ఒక విధంగా ఈ సినిమా పైన అంచనాలని పెంచింది అనే చెప్పొచ్చు.
ఇంకొన్ని గంటల్లో అఖిల్ వైజాగ్ మొత్తానికి ‘హలో’ చెప్పబోతున్నాడు.