అక్కినేని అందగాడు అఖిల్ హీరోగా ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతోన్న చిత్రానికి వెంకీ అట్లూరి దర్వకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 'తొలిప్రేమ' సినిమాతో ఫాంలోకి వచ్చిన ఈ యంగ్ డైరెక్టర్, అఖిల్‌కి తిరుగులేని బ్రేకివ్వబోతున్నాడనీ తెలుస్తోంది. ఇదో లవ్‌స్టోరీ. ఇంతవరకూ అఖిల్ చేసిన రెండు సినిమాలూ క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీలే. కానీ యాక్షన్ బేస్‌డ్ చిత్రాలు. అయితే ఈ సినిమాని మాత్రం పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వెంకీ తెరకెక్కించబోతున్నాడనీ తెలుస్తోంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. నాగార్జున రొమాంటిక్ హిట్ మూవీ 'మజ్ను'ని ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టనున్నారనీ ప్రచారం జరుగుతోంది. అయితే కొంచెం మార్పులు చేసి, 'మిస్టర్ మజ్ను' అని పెట్టాలనుకుంటున్నారట. ఇటీవల నాని హీరోగా ఆల్రెడీ 'మజ్ను' టైటిల్‌తో సినిమా వచ్చింది. మంచి విజయం అందుకుంది. అందుకే ఇదే టైటిల్ అయితే సెంటిమెంట్ పరంగా కూడా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారట.
వెంకీ అట్లూరికి అసలే ఈ సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. వరుణ్‌తేజ్‌తో రూపొందించిన 'తొలిప్రేమ' సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్‌ని పెట్టి హిట్ కొట్టాడు. అలాగే నాగార్జున పాత సినిమా టైటిల్‌ని అఖిల్ కొత్త సినిమాకి పెట్టి, మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు, అఖిల్‌కి కూడా బ్రేక్ ఇస్తాడేమో చూడాలిక. ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా క్యూట్ భామ నిధి అగర్వాల్ నటిస్తోంది.